Mahabubabad: మహబూబాబాద్‌లో సిపిఐ వినూత్న నిరసన
మహబూబాబాద్: జిల్లా కేంద్రం లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ ను వినియోగంలోకి తేవాలంటూ సిపిఐ శ్రేణులు కూరగాయల దండలు మెడలో వేసుకుని..
కూరగాయల బండ్ల తో మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. నూతన కూరగాయల మార్కెట్ ను వినియోగం లోకి తేవాలి. గాంధీ పార్కు కు విముక్తి కల్పించాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారధి మాట్లాడుతూ.... మహబూబాబాద్ పట్టణం లో రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మించి రెండు సార్లు ప్రారంభోత్సవం చేసినా కూడా వినియోగంలోకి తేలేదని , గాంధీ పార్కు లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ఉండడం వల్ల ప్రజా సంఘాలు, పార్టీలు సభలు , సమావేశాలు జరుపుకోలేకపోతున్నారని ,
యువకులు, వృద్ధులు ఉదయం, సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వీలు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గాంధీ పార్క్ లో ఉన్న తాత్కాలిక కూరగాయల మార్కెట్ ను, నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ కు తరలించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

