Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mahabubabad: మెడికల్ షాపుల బంద్.. రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు!

Mahabubabad: మెడికల్ షాపుల బంద్.. రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు!

hmtv 4 days ago

Mahabubabad: మెడికల్ షాపుల బంద్.. రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు!

మహబూబాబాద్: ఆన్ లైన్ లో ఔషధాల విక్రయాలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఔషధ దుకాణాలను మూసి వేసి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యం లో దుకాణ దారులు మహబూబాబాద్ పట్టణం లో ర్యాలీ నిర్వహించారు.

ఆన్ లైన్ లో ఔషధాల విక్రయాలను నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీంతో జిల్లా లోని 475 మెడికల్ షాప్స్ మూతపడ్డాయి.

ఈ సందర్భంగా సిపిఐ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు మాట్లాడుతూ.....

అన్ని రకాల లైసెన్స్ లు తీసుకొని , లైసెన్స్ దారుల వద్ద ఔషధాలను కొనుగోలు చేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆన్ లైన్ లో ఔషధాల విక్రయాలతో చిన్న దుకాణాలలో విక్రయాలు తగ్గి మూతపడుతున్నాయని, కార్పొరేట్ సంస్థల డిస్కౌంట్ మాయాజాలంతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు.మా దుకాణాలలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఔషదాలు.

విక్రయించాలని ఆంక్షలు విధిస్తున్నారని , ఆన్ లైన్ లో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా ఔషధాలను ఎలా ఇంటికి డెలివరీ చేస్తున్నారని , మత్తు మందులను కూడా ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆన్ లైన్ లో ఔషధాల విక్రయాలను నిలిపివేయాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా లోని ఔషధ దుకాణదారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu