Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Maharashtra: చంద్రపూర్‌లో పులి పంజా.. నలుగురు మహిళా కూలీల మృతి

Maharashtra: చంద్రపూర్‌లో పులి పంజా.. నలుగురు మహిళా కూలీల మృతి

hmtv 11 hrs ago

Maharashtra: చంద్రపూర్‌లో పులి పంజా.. నలుగురు మహిళా కూలీల మృతి

Maharashtra: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో తునికి ఆకు సేకరణకు వెళ్లిన కూలీలపై పులి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.

సింధేవాహి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తునికి ఆకుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన సమయంలో పొదల్లో ఉన్న పులి ఒక్కసారిగా దాడి చేసినట్లు సమాచారం. ఘటనతో గ్రామాల్లో భయాందోళన.

దాడి అనంతరం అటవీశాఖ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తుల ఆందోళనల మధ్య పులిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాల సహాయంతో గాలింపు చేపట్టిన అధికారులు పులిని బంధించేందుకు ఏర్పాటు చేశారు.

ఇక మరో ఘటనలో తడోబా అటవీ ప్రాంతంలో మనిషిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్న టి-83 పులిని అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించారు. ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రెండు నెలల పాటు ఆపరేషన్ నిర్వహించి పులిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనలతో చంద్రపూర్ జిల్లాలో మానవ-వన్యప్రాణుల ఘర్షణ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu