Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Malikipuram: మార్కెట్ రోడ్డులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

Malikipuram: మార్కెట్ రోడ్డులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

hmtv 1 hr ago

Malikipuram: మార్కెట్ రోడ్డులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

లికిపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండల కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.

ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది మంది పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu