Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mangalagiri: మంగళగిరిలో జనసేన కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చలు!

Mangalagiri: మంగళగిరిలో జనసేన కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చలు!

hmtv 1 week ago

Mangalagiri: మంగళగిరిలో జనసేన కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చలు!

మంగళగిరి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జనసేన పార్టీ కమిటీల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై APMSIDC చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ అయిన చిల్లపల్లి శ్రీనివాసరావు తో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కమిటీల పనితీరు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ మరింత చురుకుగా వ్యవహరించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu