Dailyhunt
Markapuram: దేవరాజు గట్టు హైస్కూల్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం!

Markapuram: దేవరాజు గట్టు హైస్కూల్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం!

hmtv 2 weeks ago

Markapuram: దేవరాజు గట్టు హైస్కూల్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం!

మార్కాపురం జిల్లా: పెద్దారవీడు మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ నూరు శాతం ఫలితాలతో పాటు మండల స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన దేవరాజు గట్టు హైస్కూల్ విద్యార్థులు.

2026 మార్చి నెలలో జరిగిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచారు. పరీక్షలకు హాజరైన 22 మంది విద్యార్థులలో ఆరుగురు విద్యార్థులు 500 మార్కులు పైచిలుకు సాధించారు. 20 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో, ఇద్దరు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు.

ఆ పాఠశాల 10 వ తరగతి విద్యార్థిని గుమ్మా భవిత 583 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో మరియు పెద్దారవీడు మండల స్థాయిలో ప్రధమ స్థానం కైవసం చేసుకోవడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఎస్ ఏ రసూల్, పాఠశాల బోధనా సిబ్బంది హర్షం ప్రకటించారు. పాఠశాల స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జి. భవిత, టి.వి. రేవతి (574), డి. మహేశ్వరి (537) లను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది మరియు మండల విద్యా శాఖాధికారి కె. సుబ్రహ్మణ్యం వారి ఇండ్లకు వెళ్లి, స్వీట్స్ పంచి, శాలువా, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. గత సంవత్సరం కూడా ఈ పాఠశాల విద్యార్థినే మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu