Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Markapuram: గ్రామాన్ని త్యాగం చేశాం.. మాకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వండి!

Markapuram: గ్రామాన్ని త్యాగం చేశాం.. మాకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వండి!

hmtv 2 weeks ago

Markapuram: గ్రామాన్ని త్యాగం చేశాం.. మాకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వండి!

మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు కోసం తమ గ్రామాన్ని త్యాగం చేసిన సుంకేసుల గ్రామ నిర్వాసితులు మరోసారి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం మరియు పునర్నిర్మాణం (R&R) ప్యాకేజీని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం R&R ప్యాకేజీ అమలులో పూర్తి పారదర్శకత పాటించి, ప్రతి అర్హ కుటుంబానికి పునరావాసం, జీవనోపాధి అవకాశాలు, ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పించాలని కోరారు.

ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసిత కుటుంబాల సమస్యలను ఇకపై ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, "మా గ్రామం చేసిన త్యాగానికి న్యాయం చేయండి... మా భవిష్యత్తును కాపాడండి... వెలుగొండ నిర్వాసితులందరికీ, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతకు R&R ప్యాకేజీని తక్షణమే అమలు చేయండి" అంటూ ప్రభుత్వానికి తమ విన్నపాన్ని తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu