Markapuram: జూలై 7న ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన!
మార్కాపురం జిల్లా: జూలై 7న ఈదుముడి లో జరుగు మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి పానుగంటి షాలేంరాజ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు...ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ సందర్భంగా ఈదుముడి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల మాదిగలు పాల్గొని వర్గీకరణ కోసం అమరులైన అమరులను స్మరించుకుంటూ భవిష్యత్ కార్యచరణకు శ్రీకారం చుట్టాలని వర్గీకరణ ఉద్యమంలో మాదిగలలో ఆత్మగౌరవం సాధించామని పోరాటపటిమను సాధించామని తర్వాతి లక్ష్యం రాజ్యాధికారిమే అని విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
32 సంవత్సరాల లో మాదిగ దండోరా ఉద్యమంలో మాదిగలకు రాజకీయ చైతన్యం లేకుండా చేయడానికి ప్రధాన కారణం ఉద్యమ న్యాయకత్వమే అని మాదిగలలో రాజకీయ చైతన్యం కన్నా రాజకీయభానిసత్వమే నాయకత్వం నేర్పిందని నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు మద్దతునిస్తూ వారి స్వార్థం కోసం జాతిని వివిధ పార్టీల వద్ద తాకట్టుపెట్టి ఉద్యమాన్ని నడిపారని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో br అంబేద్కర్ గారి లౌకిక ఆలోచన విధానం పై రాజ్యాంగంపై పాలకులు, కుట్ర పన్నుతున్నారని రాజ్యాంగం లేని మనువాద వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టే విధంగా పావులు కదుపుతున్నారని ఆకోవలోనే మాత విద్వేషాలను రెచ్చగొడుతూ దళితులపై ముస్లింలపై క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
సుప్రీంకోర్టు ద్వారా దళిత క్రైస్తవులపై 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తెచ్చి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని చర్చికి వెళ్లినంత మాత్రాన సామాజిక అంటరానితనం ఎస్సీలకు వివక్ష పోతుందా అని ప్రశ్నించారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా తెలిపారు రాజ్యాంగాన్ని రక్షించుకొంటూ మనువాద వ్యవస్థ పై పోరుకు అన్ని వర్గాల వారు జులై 7న జరుగుతున్న సభకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నేదరపల్లి జయరాజ్ జిల్లా కార్యదర్శి గోన మోహన్ రావు జాతీయ కార్యదర్శి బోడిచర్ల రాజు బడ్డీటి భాస్కర్ అర్దవీడు మండల అధ్యక్షులు పులుగుజ్జు సుబ్బారావు నవీన్ రమేష్ సన్నీ సాగర్ కొత్తపల్లి శ్యాం టిటు ప్రసాద్ వినయ్ ప్రవీణ్ యేసు ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

