Dailyhunt
Markapuram: నేరస్థులపై పోలీసుల పంజా.. కొండారెడ్డి కాలనీని చుట్టుముట్టిన ఖాకీలు!

Markapuram: నేరస్థులపై పోలీసుల పంజా.. కొండారెడ్డి కాలనీని చుట్టుముట్టిన ఖాకీలు!

hmtv 1 week ago

Markapuram: నేరస్థులపై పోలీసుల పంజా.. కొండారెడ్డి కాలనీని చుట్టుముట్టిన ఖాకీలు!

మార్కాపురం జిల్లా: మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో టౌన్ ఎస్సై విశ్వనాథ రెడ్డి, రూరల్ ఎస్సై వేమన మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఈ తనిఖీలలో భాగంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. కాలనీలోని ఇళ్ల వద్ద, వీధుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ప్రజల వివరాలు సేకరించారు.

తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 18 టూవీలర్లను పోలీసులు గుర్తించారు. వాటిలో కొన్ని వాహనాలను స్టేషన్‌కు తరలించి, సంబంధిత యజమానులు పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు సీఐ అల్తాఫ్ హుస్సేన్ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇటువంటి తనిఖీలు తరచూ కొనసాగుతాయని సీఐ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu