Medak: బర్త్‌డే ఫైర్ పరికరం పేలి చిన్నారికి తీవ్ర గాయాలు
Medak: మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. శివతేజ అనే 10 సంవత్సరాల చిన్నారి బాలుడు ఆడుకుంటుండగా నైన్ ఓల్స్ హెచ్ డబ్ల్యు బ్యాటరీ పేలి చేతివేళ్లు తెగిపడ్డాయి.
బర్త్డే ఫంక్షన్ లో ఉపయోగించే ఫైర్ కోసం వాడే పరికరం పేలడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారి ఆ కుటుంబీకులు ఆందోళన చెందారు వెంటనే బాలుని హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు.
శివంపేట మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది ఘటనతో ఒక్కసారిగా కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అమ్ముకున్నాయి 10 సంవత్సరాల చిన్నారి శివతేజ ఆడుకుంటుండగా ఈ బ్యాటరీ పేలినట్లు స్థానికులు తెలిపారు.
ఘటనతో ఒక్కసారిగా చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది సమ్మర్ హాలిడేస్ సందర్భంగా పిల్లలు బయట ఆడుకుంటున్న సమయంలో చేతిలోని బ్యాటరీ పేలినట్లు స్థానికులు తెలిపారు తనతో మండల వ్యాప్తంగా తీవ్ర విషాదఛాయలు ఆలుముకున్నాయి ఈ సoఘటన తో చిన్నారి శివతేజ చేతి వేళ్ళు తెగిపడి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.

