Medak: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.. రికార్డులు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మెదక్: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధ్యానం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా అధ్నపు.కలెక్టర్ నగేష్ అన్నారు.కౌడిపల్లి మండల్ లోని రాయలపూర్ గ్రామంలో గల పాక్స్ సెంటర్ ని అదనపు కలెక్టర్ నగేష్ సందర్శించి సెంటర్లో గల రికార్డులను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం మరియు రైతులతో రైతులతో మాట్లాడారు.
కేంద్రాల్లో టోకెన్ల జారీ, తూకం, తేమ పరీక్షలు సరైన విధంగా వేగంగా జరుగుతున్నాయా? అనే విషయాలను పరిశీలించారు. ధాన్యం బస్తాల లోడింగ్, అన్‌లోడింగ్ పనులు వేగంగా పూర్తయ్యేలా తగిన హమాలీలు, వాహనాల ద్వారా సకాలంలో సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎటువంటి ఆలస్యం కాకుండా చూడాలని, రైతులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి రైతు, ధ్యానం కొనుగోళ్ల వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేసి, చెల్లింపులు 48 గంటల లోగా జరిగేలా చూడాలన్నారు.అదే విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కేంద్రాల్లో మౌలిక వసతులను సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, రైతులు, కేంద్ర నిర్వాహకులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

