Medak: లారీల కొరత.. మెదక్-హైదరాబాద్ హైవేపై రైతుల రాస్తారోకో
Medak: రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని చేతగాని ప్రభుత్వం.అన్ని అధికార యంత్రాంగమైన తక్షణ చర్యలు తీసుకొని తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, మాజీ ఎంపిటిసి సాయిని సిద్ధిరాములు అన్నారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్ద కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి గత నాలుగు రోజులుగా లారీలు రాక 3500 బస్తాల ధాన్యం పేరుకుపోవడంతో ఆగ్రహించిన రైతాంగం.
మెదక్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై సోమవారం రస్తారోకో చేశారు. దాంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం పూట కావడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలు, వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొల్చారం ఎస్సై మహమ్మద్ అహమ్మద్దీన్ రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి సముదాయించారు. తాసిల్దార్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. ఈ సందర్భంగా పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ రైతాంగం పక్షాన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

