Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Medak: మెదక్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Medak: మెదక్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

hmtv 1 week ago

Medak: మెదక్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మెదక్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించ్చారు... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరెట్ లో జాతీయ జెండాను జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు.

అమరవీరుల స్టూపానికి నివాళ్లు అర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరుపన ఆవిర్భావ దినోత్సవ సందేశాన్ని చదివి వినిపించారు మంత్రి... తెలంగాణ అమరవీరుల కుటింబికులను సన్మానించారు. సాంసృతిక కార్యక్రమంలో అలరించిన విద్యార్థులను అభినందించిన సత్కరించారు.

అనంతరం మెదక్ జిల్లాలో వరికొనుగోలు విషయంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 5,6 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని... కొనుగోలు కానీ రైతుల ధాన్యన్ని తొందరగా మిల్లులకు తరలించాన్నారు... లారీల కొరత హమాలీలా ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు ఫీల్డ్ లో ఉండాలన్నారు.

అధికారులు జిల్లాలో తమ విధుల్లో మంచి చేస్తే ఎప్పడికి ప్రజలు గుర్తించుకుంటరని అందుకు జిల్లాలో ఉన్న అధికారులందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమతి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu