Medak: మెదక్‌లో వరి ధాన్యం కొనలేదని రైతు ఆత్మహత్య.. తీవ్ర కలకలం!
మెదక్: వరి ధాన్యం కొనడం లేదని మనుస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డలం గవ్వలపల్లి పరిధిలోని అగ్రహారంలో బుధవారం ఈ ఘటన జరిగింది.
గ్రామ స్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్రహారానికి చెం దిన గాయంతి రాజయ్య (45) తనకు మూడు ఎకరాల పొలం ఉంది అప్పుచేసి పొలంలో వరి సాగు చేయడం జరిగింది.
20 రోజుల క్రితం పంటను అంబాజీపేట కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. ధాన్యం డబ్బులు రాగానే అప్పులు తీర్చేయాలని భావించారు. ధాన్యం కొనుగోలు నిర్వాహకులు 75 నెంబర్ ఇవ్వడం జరిగింది . ప్రస్తుతం 35 నెంబర్ వరకే వడ్లు కొనుగోలు జరిగాయి లారీల కోసం ఎదురుచూస్తూ రోజూ కేంద్రానికి వచ్చి ఈ రోజైనా తన ధాన్యం కొను గోలు చేస్తారేమోనని పడిగాపులు కాసేవారు. కానీ కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురై ధాన్యం కొనలేదని.. దూలానికి ఉరివేసుకుని.
ఆత్మహత్య చేసుకున్నాడు రాజయ్య గ్రామస్తులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని మెదక్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు రాజయ్యకు ఒక కుమారుడు శ్రావణ్ భార్య ఉన్నారు. ఈ సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నాయకురాలు పద్మాదేవేందర్రెడ్డి గ్రామాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా లారీలను సకాలంలో పంపకపోవడంతోనే రైతు రాజయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఇది ప్రభుత్వ హత్యని ఆమె అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ముందు చూపుతో లారీలను సకాలంలో పంపాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెదక్ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జిల్లా అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు.అనంతరం మెదక్ జిల్లా ఆస్పత్రి మార్చురీ గదిలో ఉన్న రాజయ్య మృతదేహాన్ని పరిశీలించారు.
రైతులు చనిపోయినా పట్టించుకోని ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే యం . పద్మ దేవేందర్ రెడ్డి విమర్శించారు. శంకరంపేట్ మండలం అంబాజీపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మండల నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన రైతు రాజయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు.వడ్లు కొనుగోలు చేసి సమయానికి మిల్లులకు తరలించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
లారీలు సమయానికి రాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతుందని, అధికారులు సరైన సమన్వయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించి ఉంటే రాజయ్య ప్రాణాలు నిలిచేవని అన్నారు.ధాన్యం డబ్బులు వస్తే రైతు అప్పులు తీర్చుకునేవాడని, రాజయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎంత ధాన్యం కొనుగోలు అయింది, ఇంకా ఎంత నిల్వలో ఉంది, ఎన్ని లారీలు అవసరమో తెలుసుకోవడంలో కూడా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులను ఆదుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.
వీరి వెంట శంకరంపేట్ మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి. రాజు, గవ్వలపల్లి సర్పంచ్ సిద్ధిరాములు, మాజీ వైస్ ఎంపీపీ సత్య గౌడ్ మాజీ సర్పంచులు పోచయ్య దయానంద్ నాయకులు ప్రభాకర్ పడాల శ్రీనివాస్, మహేష్, కొమురయ్య, మల్లుపల్లి సర్పంచ్ నరేష్,రైతులు తదితరులు ఉన్నారు.

