Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Medak: మెదక్‌లో విద్యా విజయోత్సవం.. ప్రభుత్వ బడుల్లో త్వరలోనే సీఎం బ్రేక్‌ఫాస్ట్!

Medak: మెదక్‌లో విద్యా విజయోత్సవం.. ప్రభుత్వ బడుల్లో త్వరలోనే సీఎం బ్రేక్‌ఫాస్ట్!

hmtv 1 week ago

Medak: మెదక్‌లో విద్యా విజయోత్సవం.. ప్రభుత్వ బడుల్లో త్వరలోనే సీఎం బ్రేక్‌ఫాస్ట్!

మెదక్: చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని , అదనపు కలెక్టర్ నగేష్ హితవు పలికారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మెదక్ నందు జరిగిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విద్యా విజయోత్సవ దినం నిర్వహించారు.

అతిథులుగా విచ్చేసి, అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు. డీఈఓ రాజు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారోత్సవాలలో భాగంగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను, జిల్లా విద్యాశాఖ సాధించిన ప్రగతి గురించి డీ.ఈ.ఓ రాజు ముందుగా నివేదిక రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు.

భవిష్యత్తులో స్థిరపడేందుకు పదవ తరగతి తరువాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకం అయినందున, మీకు ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సులలో చేరాలని, ఈ విషయంలో ఎవరు ఏం అనుకుంటారో అనే సంశయాలు, మొహమాటానికి లోను కాకూడదని విద్యార్థులకు సూచించారు. ఎంచుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలని, ఆ దిశగా అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోగల్గుతారని అన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మల్చుకోవాలని, ఇది పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. బలహీనతలను అధిగమిస్తూ, స్పష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుందని విద్యార్థులకు మార్గోపదేశం చేశారు. ఉపాధ్యాయులు అంటే తనకు ఎంతో గౌరవం అని వెల్లడించిన అదనపు కలెక్టర్, విద్యార్థులు భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా తమ గురుతర బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. అప్పుడే గురువు అనే స్థానానికి మరింత గౌరవం, వన్నె లభిస్తూ సార్ధకత చేకూరుతుందని అన్నారు.

తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్షను చూపకుండా వారిని ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలలో రాణించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ, మెరుగైన విద్యా బోధనకై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ బడులలో సీ.ఎం బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) పథకాన్ని అమలు చేయనుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాస్థాయిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ మరియు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు ప్రతి విద్యార్థికి పదివేల చొప్పున నగదు బహుపది ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు , ఏఎంఓ సుదర్శన్ మూర్తి సీఎంఓ రాజు ,ఏ ఎస్ ఓ నవీన్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu