Dailyhunt
Medak: నర్సాపూర్‌లో ప్రమాదాల రాత్రి.. కారు-ఆటో ఢీ తండ్రీకొడుకులకు రక్తగాయాలు!

Medak: నర్సాపూర్‌లో ప్రమాదాల రాత్రి.. కారు-ఆటో ఢీ తండ్రీకొడుకులకు రక్తగాయాలు!

hmtv 2 weeks ago

Medak: నర్సాపూర్‌లో ప్రమాదాల రాత్రి.. కారు-ఆటో ఢీ తండ్రీకొడుకులకు రక్తగాయాలు!

మెదక్ జిల్లా (నర్సాపూర్): మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు కారు ఆటో డీ.

మెదక్ నుంచి కారు అతివేగంతో వస్తూ నర్సాపూర్ చౌరస్తా వద్ద దౌల్తాబాద్ నుండి తూప్రాన్ వెళుతున్న టాటా ట్రాలీ ఆటో ను ఢీ కొట్టిన కారు.

ఈ ఘటనలో కారు మరియు ఆటో డ్యామేజ్ అవ్వగా ఎటువంటి ప్రాణనాష్టం జరగలేదు.

నర్సాపూర్ పోలీస్ తెలిపారు. మరో కార్ ఘటనలో కౌడిపల్లి మండల్ కన్నారం నుండి నర్సాపూర్ కు వస్తున్న ఒక పూల వ్యాపారి తన కొడుకును బైక్ వెనుక కూర్చోబెట్టుకొని వస్తుండగా హైదరాబాద్ నుండి ఏడుపాయల వెళుతున్న కియా కార్ అతివేగంతో నర్సాపూర్ మెదక్ రహదారి పక్కన ఉన్న సద్గురు హోటల్ దగ్గర బైకును ఢీకొనడంతో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడడంతో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu