Medarametla: హైవేపై తృటిలో తప్పిన ప్రాణాపాయం డివైడర్‌ను ఢీకొట్టిన కారు
మేదరమెట్ల: ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
విజయవాడ నుండి సూళ్లూరుపేట కు ప్రయాణిస్తున్న కారు మేదరమెట్ల ఫ్లైఓవర్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు సెంటర్ డివైడర్ ని ఢీ కొనింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు ప్రమాద తీరుపై విచారణ చేపట్టారు.

