Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Medchal: మానవత్వం మంట కలిసి పోతుంది.. కన్నకూతురిపై కన్నేసిన కిరాతక తండ్రి!

Medchal: మానవత్వం మంట కలిసి పోతుంది.. కన్నకూతురిపై కన్నేసిన కిరాతక తండ్రి!

hmtv 3 weeks ago

Medchal: మానవత్వం మంట కలిసి పోతుంది.. కన్నకూతురిపై కన్నేసిన కిరాతక తండ్రి!

Medchal: కామాంధుడైన తండ్రికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష! ఏడాదిలోపే తీర్పు వెలువరించిన మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు పోలీసుల పకడ్బందీ దర్యాప్తుకు నిదర్శనం..

బాధితురాలికి రూ. 3 లక్షల పరిహారం.

రక్తసంబంధాన్ని మరిచి, కన్నకూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిన ఒక కిరాతక తండ్రికి న్యాయస్థానం తగిన శాస్తి చేసింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ జిల్లాలోని ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఏడాది తిరగకముందే కేసును తార్కిక ముగింపుకు చేర్చి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసిన పోలీసు యంత్రాంగాన్ని బాధితురాలి బంధువులు, స్థానికులు అభినందిస్తున్నారు. గత ఏడాది మే నెలలో, బీహార్ రాష్ట్రానికి చెందిన అస్గర్ అలీ (36) తన సొంత కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు జీడిమెట్లలోని సుభాష్ నగర్ ప్రాంతంలో కూలీ పనులు చేస్తూ నివసించేవాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించిన గౌరవ మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కె. వెంకటేష్, నిందితుడిపై మోపబడిన ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైనట్లు ప్రకటించారు. పకడ్బందీ ఆధారాలను పరిశీలించిన

అనంతరం నిందితుడికి భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టాల కింద: వివిధ సెక్షన్ల కింద నిందితుడికి గరిష్టంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 35,000 రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా బాలిక భవిష్యత్తు, మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని 3,00,000 (మూడు లక్షల రూపాయల) పరిహారం అందజేయాలని ప్రభుత్వం, న్యాయస్థానం ఆదేశించింది.

పోలీసుల సమర్ధతకు నిదర్శనం:

ఈ కేసులో దర్యాప్తు అధికారి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ నేతృత్వంలో పోలీసులు శాస్త్రీయ ఆధారాలను సేకరించి, అత్యంత వేగంగా దోష పత్రాన్ని (ఛార్జ్ షీట్) దాఖలు చేశారు. ఏదాది లోపే విచారణ ముగించి శిక్ష పడేలా చేయడంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రభాకర్ రెడ్డి, కోర్టు విధుల అధికారి జె. శ్రీనివాస్, లైజన్ ఆఫీసర్ లి యు. మౌనిక, సమన్ల విభాగం నుండి బి. నాగరాజు కీలక పాత్ర పోషించారు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం ముందు తలవంచక తప్పదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. ముఖ్యంగా మైనర్ బాలికలపై జరిగే నేరాల్లో పోలీసులు చూపుతున్న చొరవ నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu