Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Medchal: ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్!

Medchal: ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్!

hmtv 1 week ago

Medchal: ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్!

Medchal: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా దోపిడీ చేసిన అనంతరం నగ్న వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు వివరాల ప్రకారం.. కండ్లకోయలోని ఓ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న యువతి, తన సహ విద్యార్థి యువకుడితో స్నేహం పెంచుకుంది. అనంతరం ప్రేమ పేరుతో ఆమెను ఒప్పించిన నిందితుడు ఆక్షేపణీయ ఫోటోలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

తరువాత పలుమార్లు తనపై లైంగికంగా వేధించడమే కాకుండా, వీడియో కాల్స్ సమయంలో నగ్న దృశ్యాలను రికార్డు చేసి ఫోటోలు సేకరించాడని యువతి తెలిపింది. అనంతరం డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపించింది. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu