Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Medchal: పూడూర్‌లో క్రీడా మైదానం వివాదం.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి!

Medchal: పూడూర్‌లో క్రీడా మైదానం వివాదం.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి!

hmtv 6 days ago

Medchal: పూడూర్‌లో క్రీడా మైదానం వివాదం.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి!

Medchal: పూడూర్‌-కిష్టాపూర్‌ డివిజన్‌ పరిధి పూడూర్‌ గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని కాపాడాలంటూ క్రీడాకారులు,యువకులు మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

పూడూర్‌ గ్రామంలో యాదవ సంఘం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను కలిసి గ్రామ పరిధిలోని 608 సర్వే నెంబర్‌లో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిందన్నారు. క్రీడాకారుల ఆటల కోసం కేటాయించిన స్థలాన్ని ఇతరులకు ఇవ్వకుండా క్రీడలకు కేటాయించాలని కోరారు. క్రీడా మైదానం ఉంటేనే యువకులు క్రీడలపై ఆసక్తితో ముందుకు సాగుతారని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌యాదవ్, ప్రవీణ్,ప్రశాంత్,నిఖిల్,పరమేశ్,శ్రీనివాస్,శివ,సాయి,ప్రతాప్, మధు,దినేశ్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu