Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mega 158 : చిరంజీవి కొత్త సినిమా ఓపెనింగ్‌లో అరుదైన దృశ్యం.!

Mega 158 : చిరంజీవి కొత్త సినిమా ఓపెనింగ్‌లో అరుదైన దృశ్యం.!

hmtv 4 days ago

Mega158

Mega 158 : మెగా అభిమానులకు ఇంతకంటే పెద్ద పండుగ ఏముంటుంది? చాలా కాలం తర్వాత మెగా బ్రదర్స్ ఒకే వేదికపై, ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను మురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ఒకే చోట సందడి చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే కొత్త సినిమా అఫీషియల్ ఓపెనింగ్ వేడుకలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ శాలువాపై ముగ్గురి ఆకారాలు.. నెటిజన్లు ఫిదా..!

ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఒక అత్యంత ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. సినిమా యూనిట్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్‌లను ఒక ప్రత్యేకమైన శాలువాతో సత్కరించారు. ఆ శాలువా సాధారణమైనది కాదు.. దానిపై మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ల ముఖ చిత్రాలను ఎంతో అద్భుతంగా నేతతో అల్లి రూపొందించారు. ఈ ప్రత్యేకమైన శాలువాను అక్కడ ఉన్న వారందరికీ చూపిస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మురిసిపోయారు.

పవన్ భుజంపై చేయి వేసి.. మెగాస్టార్ ఆత్మీయత

శాలువాతో సత్కరించిన అనంతరం, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ భుజంపై ఎంతో ఆత్మీయంగా చేయి వేసి ఫొటోలకు పోజులిచ్చారు. వీరి పక్కనే నాగబాబు, ముద్రగడ పద్మనాభం, చిత్ర బృందం నిలబడి ఫొటోలు దిగారు. ముగ్గురు అన్నదమ్ములు ఇలా ఒకే వేదికపై పక్కపక్కనే నిలబడటం చూసి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఇదే కదా మాకు కావలసిన అసలైన పండుగ" అంటూ ఈ వీడియోను ఇంటర్నెట్‌లో తెగ షేర్ చేస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఈ క్రేజీ ఓపెనింగ్‌తో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu