Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరు మామూలోళ్లు కాదు భయ్యా..కంగనా రనౌత్ వీడియో భలే బయటకు తీశారే..!

మీరు మామూలోళ్లు కాదు భయ్యా..కంగనా రనౌత్ వీడియో భలే బయటకు తీశారే..!

hmtv 1 week ago

మీరు మామూలోళ్లు కాదు భయ్యా..కంగనా రనౌత్ వీడియో భలే బయటకు తీశారే..!

Kangana Ranaut Canne Video: వివాదాలకు మారుపేరుగా నిలిచే బాలీవుడ్ బ్యూటీ, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు.

తరచూ తన ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించే కంగనా, ఈసారి నేటి తరాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా రనౌత్... ప్రస్తుత యువత, వారి ఆలోచనా విధానం, జీవన శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేటి తరం యువతను జనరేషన్ గట్టర్ అంటూ అభివర్ణించారు. వారి ప్రవర్తన, క్రమశిక్షణ లేకపోవడం సమాజానికి హానికరం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వివాదానికి దారితీశాయి.

కంగనా చేసిన ఈ నీతి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులకు నీతులు చెప్పేముందు ఒక్కసారి మీ గతాన్ని చూసుకోండి అంటూ ఆమెను గట్టిగా కౌంటర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2018 నాటి ఒక పాత వీడియోను బయటకు తీసి, రీ-షేర్ చేస్తూ నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

2018లో జరిగిన ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత జరిగిన పార్టీలో కంగనా పాల్గొన్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అందులో ఆమె ఒక రివీలింగ్ బ్లాక్ డ్రెస్‌లో సరదాగా డాన్స్ చేస్తూ, పార్టీని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకవైపు స్వయంగా తానే గ్లామర్ హంగామా, లేట్ నైట్ పార్టీలలో పాల్గొంటూ... మరోవైపు నేటి తరాన్ని 'గట్టర్' అని తిట్టడం కంగనా ద్వంద్వ నీతికి అద్దం పడుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. పార్టీ సంస్కృతిని, గ్లామర్ ప్రపంచాన్ని స్వయంగా ఆస్వాదించిన మీరా నేటి యువతకు సంస్కారం గురించి చెప్పేది? అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ఇతరులను వేలెత్తి చూపేముందు మీ వేళ్లు ఎటువైపు ఉన్నాయో చూసుకోండి అంటూ మరొకరు సెటైర్లు వేశారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంగనా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాకపోయినా, ఈసారి సొంతంగా ఆమె పాత వీడియోలతోనే నెటిజన్లు ఎదురుదాడి చేయడంతో కంగనా రనౌత్ తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu