Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరు మారరా.. గంజాయిలో కూడా అప్డేట్ వెర్షన్స్.. 12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం..!

మీరు మారరా.. గంజాయిలో కూడా అప్డేట్ వెర్షన్స్.. 12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం..!

hmtv 3 days ago

hydroponic ganja

Hydroponic Ganja : సమాజంలో టెక్నాలజీ ఎంత వేగంగా అప్‌డేట్ అవుతుందో.. డ్రగ్స్ పెడ్లర్లు కూడా అంతే వేగంగా అప్‌డేట్ అవుతున్నారు. సాధారణంగా దొరికే గంజాయి కాకుండా, ఇప్పుడు మార్కెట్లోకి సరికొత్త అప్‌డేట్ వెర్షన్ డ్రగ్స్ ప్రవేశపెడుతున్నారు.

తాజాగా తెలంగాణలో ఇలాంటి ఒక భారీ హై-టెక్ గంజాయి ముఠా గుట్టురట్టయింది. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ టీమ్ ఒక అద్భుతమైన ఆపరేషన్ చేపట్టి, కోట్లాది రూపాయల విలువైన అధునాతన గంజాయిని పట్టుకుంది.

ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

తెలంగాణలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ టీమ్ అత్యంత పక్కా సమాచారంతో ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఈగల్ టీమ్ అధికారులు అడ్డంగా బుక్ చేశారు. ఈ దాడుల్లో నిందితుల నుంచి ఏకంగా 12 కోట్ల రూపాయల విలువైన 'హైడ్రోపోనిక్' గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో ఈ రకం గంజాయి దొరకడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

థాయిలాండ్ టు ఇండియా.. వయా హైదరాబాద్

ఈ ముఠా నెట్‌వర్క్ మామూలుగా లేదు. థాయిలాండ్ దేశం నుంచి భారతదేశానికి ఈ హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్‌కు కూడా దీనిని గుట్టుగా రవాణా చేస్తున్నారు. యువతను, ధనవంతులను టార్గెట్ చేస్తూ ఈ ముఠా భారీగా లాభాలు గడిస్తోంది.

మహిళతో సహా 10 మంది పెడ్లర్లు అరెస్ట్

ఈ అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా ముఠాకు సంబంధించి ఒక మహిళతో పాటు మొత్తం 10 మంది గంజాయి పెడ్లర్లను అధికారులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. వీరిని విచారించడం ద్వారా ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న మరికొందరు పెద్ద తలకాయల వివరాలు, అలాగే ఎవరెవరికి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయాలు బయటకు రానున్నాయి.

ఏమిటీ హైడ్రోపోనిక్ గంజాయి.?

సాధారణ గంజాయిని పొలాల్లో, సహజ వాతావరణంలో పండిస్తారు. కానీ ఈ 'హైడ్రోపోనిక్' గంజాయి పూర్తిగా భిన్నమైనది. దీనిని మట్టి లేకుండా, కేవలం పోషకాలు ఉన్న నీటిని ఉపయోగిస్తూ, ఇళ్ల లోపల (ఇండోర్) కృత్రిమ కాంతి , నియంత్రిత ఉష్ణోగ్రత మధ్య ల్యాబ్‌ల తరహాలో పండిస్తారు. సాధారణ గంజాయితో పోలిస్తే ఇందులో కిక్ ఇచ్చే కెమికల్స్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డ్రగ్స్ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్, కోట్లలో ధర పలుకుతోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఈ ముఠా మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu