Mirudoddi: ధర్మారం చౌరస్తాలో జీబ్రా లైన్లు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండలం ధర్మారం చౌరస్తా 765 డీజీ జాతీయ రహదా రిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ తెలిపారు.
నేష నల్ హైవే ఏఈ అన్నయ్య సహకారంతో మండల పరిధిలోని ధర్మారం గ్రామం గుండా వెళ్లే జాతీయ రహదారిపై ప్రమా దాలు జరగకుండా జీబ్రా లైన్లు ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ధర్మారం చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు జీబ్రా లైన్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీని వాస్, ఉప సర్పంచ్ బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

