Miryalaguda: మిర్యాలగూడ చెత్తరహిత మున్సిపాలిటీగా మారాలి కలెక్టర్
మిర్యాలగూడ: వచ్చే అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నాటికి మిర్యాలగూడను సంపూర్ణ చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి.
చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ మున్సిపల్ సమావేశ హాలులో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మున్సిపల్ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్య లోపం వల్ల వ్యాధులు, దోమలు, కుక్కల బెడద పెరుగుతుందని, శానిటేషన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. అక్టోబర్ 2 నుంచి ప్రతి ఇంటా 4 రకాల వ్యర్థాల సేకరణ బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బందికి ఆన్లైన్ హాజరు తప్పనిసరి అని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

