Miryalaguda: యూత్ కాంగ్రెస్ నిరసన ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం!
మిర్యాలగూడ: నీట్ పరీక్ష లీకులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిజెపి పాలనలో 89 సార్లు వివిధ పరీక్షా పత్రాలు లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. నీట్ పరీక్ష పత్రం లీక్ కారణంగా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు తీవ్ర గందరగోళం లో పడ్డారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న లీక్ కుంభకోణాలను ప్రోత్సహిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ఎండ కట్టారు.

