Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mobile: మీ మొబైల్‌లో కచ్చితంగా ఉండాల్సిన యాప్స్ ఇవే.. పూర్తి వివరాలు ఇవిగో!

Mobile: మీ మొబైల్‌లో కచ్చితంగా ఉండాల్సిన యాప్స్ ఇవే.. పూర్తి వివరాలు ఇవిగో!

hmtv 2 weeks ago

Mobile: మీ మొబైల్‌లో కచ్చితంగా ఉండాల్సిన యాప్స్ ఇవే.. పూర్తి వివరాలు ఇవిగో!

Mobile: ప్రస్తుత డిజిటల్ యుగంలో పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక మొబైల్ అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చింది.

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా కొన్ని యాప్స్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పనులు వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి మొబైల్‌లో తప్పకుండా ఉండాల్సిన ఆ ముఖ్యమైన యాప్స్ వివరాలు ఇవే.

mParivahan: డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాల కోసం ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

DigiLocker: మీ ముఖ్యమైన ధృవపత్రాలను సురక్షితంగా, డిజిటల్‌గా దాచుకోవడానికి ఇది బెస్ట్ యాప్.

DigiYatra: విమాన ప్రయాణాల్లో వేగవంతమైన చెకిన్ కోసం దీన్ని వాడుకోవచ్చు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఎయిర్‌పోర్ట్ ఎంట్రీని ఇది మరింత సులభతరం చేస్తుంది.

UMANG: వందలాది ప్రభుత్వ సేవలకు ఒకే వేదిక ఈ ఉమంగ్ యాప్.

AIS: పన్ను వివరాల పర్యవేక్షణకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఆదాయపు పన్ను చెల్లించేవారు తమ వార్షిక సమాచారాన్ని దీని ద్వారా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.

RBI: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ రిటైల్ డైరెక్ట్ ప్లాట్‌ఫారమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రోకర్ అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది అనుకూలం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu