Mopal: ధాన్యం కొనుగోలులో జాప్యం.... రైతుల ఆవేదన
మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామం లో ధాన్యం కొనుగోల్లో జాప్యం ఆవేదన చెందుతున్న రైతులు..గత నెల రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...వాతవరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఒకవైపు భయం మరో వైపు నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్ద రైతులు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు.
ధాన్యం కుప్పల నుండి ధాన్యం తరలించాలని రైతులు సొసైటీ అధికారులకు విన్నపించిన పట్టించుకోవడంలేదని రైతులు తెలిపారు.మోపాల్ సొసైటీ పరిధిలోని కులాస్ పూర్ గ్రామం లో నెల రోజులుగా కొనుగోళ్లు సరిగా జరగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సొసైటీ సిబ్బందికి ధాన్యాన్ని తొందరగా తరలించాలని తెలిపిన కూడా రైతన్నలను పట్టించుకోవడంలేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కల్లాల్లో ధాన్యం బస్తాలు కుప్పలు గా దర్శనం ఇస్తున్నాయి.
కొనుగోళ్లు వేగంగా జరగకపోవడంతో ఎటు చూసినా రోడ్లపై ధాన్యం సంచులే కనిపిస్తున్నాయి..గ్రామాల్లో నేటికీ ధాన్యం కుప్పలు రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి.నత్తనడకన వడ్ల కొనుగోళ్లు జాప్యం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్లు తెచ్చి నెలరోజులవుతున్నా ధాన్యం కుప్పల నుండి ధాన్యం తరలించడం లేదని రైతులు తెలిపారు. . రోజుల తరబడి రైతులు ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు.ఇప్పటికైనా సొసైటీ అధికారులు స్పందించి కులాస్ పూర్ గ్రామం నుండి తొందరగా ధాన్యాన్ని తరలించాలని రైతులు కోరారు.

