Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mulugu: ములుగు జిల్లాలో చిరుత పులి కలకలం

Mulugu: ములుగు జిల్లాలో చిరుత పులి కలకలం

hmtv 2 days ago

Mulugu: ములుగు జిల్లాలో చిరుత పులి కలకలం

ములుగు: వెంకటాపురం మండలం ఏదిరా యాకన్న గూడెం రహదారి పక్కన చిరుత పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు.పశువుల, గొర్రెల కాపరులు అడవి ప్రాంతం అంచున వెళ్లొద్దని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక...మహిళలు పిల్లలు ఒంటరిగా సాయంత్రం వేళలో అడవి ప్రాంతం వైపు వెళ్ళవద్దని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

చిరుత పులి అడవి ప్రాంతం వైపు వెళ్తున్నట్టుగా అధికారులు గుర్తింపు. గ్రామస్తులకు చిరుత పులి కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చతిస్గడ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నేషనల్ జూ పార్కు నుండి తెలంగాణ వైపు వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించి తిరిగి ఆ జూ పార్క్ వైపు వెళ్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu