Mulugu: ములుగు జిల్లాలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ!
Mulugu: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని పిలుపునిచ్చిన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు.
వినాయక చవితిని పురస్కరించుకొని ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ...
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక - ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ZPHS కమలాపురం పాఠశాల సహకారంతో విగ్రహాల పంపిణీ. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక
ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ZPHS కమలాపురం పాఠశాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం ఉందని...
అందువల్ల పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను వినియోగించాలని పిలుపునిచ్చారు. జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, జన విజ్ఞాన వేదిక హెల్త్ విభాగం కన్వీనర్ మునిగాల రాకేష్ మాట్లాడుతూ...
గ్రామ ప్రజలందరూ రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను పూజించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం జన విజ్ఞాన వేదిక,
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక చెకుముకి కన్వీనర్ పల్లె నాగరాజు, లక్ష్మణ్ రావు, యలవర్తి శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్,
శ్రీధర్‌తో పాటు ZPHS కమలాపురం విద్యార్థులు రాజేష్, రవళి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ... భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలన్న సందేశంతో ఈ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది.

