Dailyhunt
Mundlamuru: 20 రోజుల క్రితం కొట్టేసిన చెట్టు.. రాత్రికి ఎలా నిలబడింది!

Mundlamuru: 20 రోజుల క్రితం కొట్టేసిన చెట్టు.. రాత్రికి ఎలా నిలబడింది!

hmtv 1 week ago

Mundlamuru: 20 రోజుల క్రితం కొట్టేసిన చెట్టు.. రాత్రికి ఎలా నిలబడింది!

ముండ్లమూరు: ప్రకాశం జిల్లాలో ఆశ్చర్యం… కొట్టిన రావి చెట్టు మళ్లీ నిలబడి గ్రామంలో భక్తి వాతావరణం.

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మరేళ్ళ గ్రామంలో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సుమారు 20 రోజుల క్రితం గ్రామంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టును గ్రామస్థులు కొట్టి పడేశారు. ఆ చెట్టు కర్రలను బ్రహ్మంగారి హోమం కోసం ఉపయోగించినట్లు స్థానికులు తెలిపారు. అయితే నేడు ఉదయం గ్రామస్థులు గమనించినప్పుడు, కొట్టి పడేసిన అదే రావి చెట్టు మళ్లీ లేచి నిలబడినట్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చెట్టుకు పూజలు నిర్వహించడం ప్రారంభించారు. కొందరు దీన్ని దైవ చింతనగా భావిస్తుండగా, మరికొందరు ఇది సహజ ప్రక్రియలో భాగమై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో ప్రస్తుతం భక్తి వాతావరణం నెలకొంది. చెట్టు వద్దకు వచ్చి ప్రజలు దీపాలు వెలిగిస్తూ, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు, అసలు కారణాలను తెలుసుకునేందుకు పరిశీలన చేపట్టనున్నట్లు తెలిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu