Dailyhunt
Mydukur: జీవామృతం నుంచి ఏటీఎం మోడల్ వరకు.. మైదుకూరులో రైతు భరోసా కేంద్రం

Mydukur: జీవామృతం నుంచి ఏటీఎం మోడల్ వరకు.. మైదుకూరులో రైతు భరోసా కేంద్రం

hmtv 6 days ago

మైదుకూరు: మైదుకూరు మండలంలోని రైతు సేవా కేంద్రంలోని VAA, VHA లకు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి సమక్షంలోరెండు రోజుల శిక్షణ కార్యక్రమం లో మొదటి రోజు బయో రీసెట్ సెంటర్, ఫ్రీమాన్ డ్రైసోయింగ్ పంట, ఏటీఎం మోడల్, ఆఫ్ మూన్ మోడల్, ద్రవ జీవామృతం తయారీ, ఘన జీవామృతం తయారీ, విత్తన గుళికలు తయారీ విధానాన్ని సిబ్బంది తెలుసుకోవడం జరిగినది.

మైదుకూరు వ్యవసాయ డివిజన్ అధికారి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎల్లినో ప్రభావం వల్ల రైతులు రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి తెలియజేయడం జరిగింది వాటిని అధిరోహించడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోని PMDS, ఆఫ్ మూన్ మోడల్ పాటించి నేల సారవంతం తో పాటు ఆదాయాన్ని కూడా పొందవచ్చు అని తెలియజేశారు. అలాగే వ్యవసాయ అధికారి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అమలవుతున్న మోడల్స్ ని గురించి అవగాహన కల్పించడంతోపాటు రెండవ రోజు వీటి పైన శిక్షణ ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కృష్ణారెడ్డి, FMT లు, icrp లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu