Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Naidupeta: నాయుడుపేట వ్యాపారులకు అలర్ట్.. ప్లాస్టిక్ వాడితే మున్సిపాలిటీ యాక్షన్ ప్లాన్!

Naidupeta: నాయుడుపేట వ్యాపారులకు అలర్ట్.. ప్లాస్టిక్ వాడితే మున్సిపాలిటీ యాక్షన్ ప్లాన్!

hmtv 1 week ago

Naidupeta: నాయుడుపేట వ్యాపారులకు అలర్ట్.. ప్లాస్టిక్ వాడితే మున్సిపాలిటీ యాక్షన్ ప్లాన్!

తిరుపతి జిల్లా: నాయుడుపేట లని మున్సిపాలిటీ పరిధిలో గల ప్రతి షాప్ యజమానులు ప్లాస్టిక్ నిర్మూలన చర్యలను త్వరత గతిన చేపట్టాలని ఇప్పటికే పలుమార్లు టాప్ యజమానులకు ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకం పై అవగాహన కల్పించడం మరియు వారికి ఈ కవర్లను వాడకుండా తెలియజేయడం జరిగిందని అయినా కొంతమంది షాప్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపాలిటీ మేనేజర్ ఉరుకుందమ్మ తెలియజేశారు, అయితే షాపులకు వచ్చే కస్టమర్లను వారికి ఏ సామాన్లు కావాలో దానికి సంబంధించిన సంచులను ఇంటి వద్ద నుండి తెచ్చుకునే విధంగా షాపు యజమానుల తెలియపరచాలని తెలియజేసిన ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లను అందజేయడం జరుగుతుందని దీనిపై మున్సిపాలిటీ చర్యలు తీసుకునే విధంగా ఆచరణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.

ముఖ్యంగా కూరగాయల మార్కెట్ మాంసాహారం మార్కెట్ పరిధిలో ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా జరుగుతుందని దీని నిర్మూలించాలంటే ఇంటి వద్ద నుంచే పాతకాలంలో మాదిరిగా గుడ్డ సంచులను మరియు మాంసాహారాలను ఇంటికి తీసుకొని వెళ్లేవారు స్టీల్ బాక్స్లను వినియోగించే విధంగా షాప్ యజమానులు వారి కస్టమర్లకు తెలియజేయాలని ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మున్సిపాలిటీ అధికారులు సచివాలయ ఉద్యోగులు తెలియజేయడం జరిగిందని ఈరోజు కూడా వారికి అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రతి షాపు యజమానులకు మరియు ప్రజలకు తెలియజేయడం జరిగిందని ప్లాస్టిక్ భవిష్యత్తు తరాలను చిన్న భిన్నం చేసే ప్రక్రియలో మొదటి భాగంగా ఉంటుందని కచ్చితంగా రేపటి తరానికి స్వచ్ఛమైన గాలి నీరు అందించాలంటే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని వెంటనే నిర్మూలించాలని మునిసిపాలిటీ మేనేజర్ ఉరుకుందమ్మ తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu