Nalgonda: నల్లగొండలో మంత్రుల పర్యటన.. చివరి గింజ వరకు కొంటాం!
నల్లగొండ జిల్లా: చెట్ల చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
రైతులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం, కొనుగోలు చేసి మిల్లుకు పంపినవి,ఇంకా ఎంత ధాన్యం ఉన్నది,ఎన్ని రోజుల్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తారని అధికారులను ఆరా తీసిన మంత్రులు.
కొనుగోళ్లలో వేగం పెంచి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని,సేకరించిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని అందుకు అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రులు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ గతం కంటే ధాన్యం ఉత్పత్తి పెరిగింది. కొంత హమాలీ సమస్య కూడా ఉండే. కొన్న ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేశాం.
ముఖ్యమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత 10రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. ధాన్యం కొనుగోలు సెంటర్ నుండి కొన్న ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా లారీల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించాం. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చివరి గింజ వరకు మా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. రైతుల సంక్షేమానికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ.
శ్రీరామ్ సాగర్,నాగార్జున సాగర్,శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు కట్టిన ఫలితంగా ధాన్యం సాగు పెరిగింది. కొంతమంది తెలంగాణను ఎగతాళి చేశారు..కరెంట్ తీగల మీద బట్టలు అరేసుకుంటారు అని చులకనగా మాట్లాడారు.
నేడు తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఉన్న కొన్ని సమస్యలు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం. మా ప్రభుత్వాన్ని విమర్శించే వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. SLBC పూర్తి చేసి త్వరలో మరింత భూమి సాగులోకి వచ్చేందుకు కృషి చేస్తున్నాం..

