Nalgonda: పత్తుల్లో ప్రాణాలు కాపాడటమే లక్ష్యం ఎన్‌సీసీ ఎస్‌డీఎంఏ
నల్గొండ: విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడేలా యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో "యువ ఆపద మిత్ర" శిక్షణా శిబిరం ఉత్సాహంగా సాగుతోంది.
31వ బెటాలియన్ ఎన్‌సీసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 300 మంది ఎన్‌సీసీ కేడెట్లకు నిర్వహిస్తున్న 7 రోజుల సమగ్ర శిక్షణ కార్యక్రమం బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది.
శిక్షణలో భాగంగా పానగల్ జలాశయంలో కేడెట్లకు ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. కేడెట్లను వివిధ బృందాలుగా విభజించి, లైఫ్ బోట్లు, లైఫ్ జాకెట్లు, రక్షణ సామగ్రిని ఉపయోగించే విధానాన్ని వివరించారు. నీటిలో మునిగిపోతున్న వారిని ఎలా రక్షించాలనే అంశంపై ప్రత్యక్షంగా చూపించారు.

