Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nalgonda: రబీ ధాన్యం కొనుగోళ్ల జోరు.. రైతులకు రూ.1313.89 కోట్లు జమ!

Nalgonda: రబీ ధాన్యం కొనుగోళ్ల జోరు.. రైతులకు రూ.1313.89 కోట్లు జమ!

hmtv 1 week ago

Nalgonda: రబీ ధాన్యం కొనుగోళ్ల జోరు.. రైతులకు రూ.1313.89 కోట్లు జమ!

నల్లగొండ: రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా నల్లగొండ జిల్లాలో గురువారం నాటికి 1682.74 కోట్ల రూపాయల విలువ చేసే 7 లక్షల 4372 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ బి.

చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెలాఖరు నాటికి జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసి రబీ ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.జిల్లాలో రబీ ధాన్యం సేకరణ వివరాలను ఆయన వెల్లడిస్తూ.... రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు గాను నల్గొండ జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 217 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయినందున వాటిని మూసి వేయడం జరిగిందని, ప్రస్తుతం 247 కొనుగోలు కేంద్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 7 లక్షల 42529 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, 6,90 171 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని, 5,49974 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్రక్ సీట్లు కూడా జనరేట్ అయ్యాయని తెలిపారు. 5 లక్షల 78979 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశామని, ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు 1313.89 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు.ఈ నెలాఖరు వరకు జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలును పూర్తి చేస్తామని, రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని, అలాగే తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపిస్తామని, ఈ విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu