Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nandavaram: టీడీపీ నేతల అవాస్తవం ఆరోపణలు గురురాజ్ దేశాయ్

Nandavaram: టీడీపీ నేతల అవాస్తవం ఆరోపణలు గురురాజ్ దేశాయ్

hmtv 1 week ago

నందవరం: టీడీపీ పార్టీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని బీజేపీ నాయకుడు, దేశాయ్ నెట్వర్క్ అధినేత గురురాజ్ దేశాయ్ అన్నారు.కర్నూలు జిల్లా నందవరం మండలంలోని వారి కార్యాలయంలో మీడియాతో గురురాజ్ దేశాయ్ మాట్లాడుతూ జీ నెట్వర్క్ బకాయిలు పెండింగ్ లో ఉన్న కారణంగా అందుకు డిల్లీ కోర్టు వారు వ్యక్తిగత హాజరు కావాలని తెలపడంతో కోర్టు కు హాజరు కావడం జరిగింది.

గత 30 ఏళ్లుగా నెట్వర్క్ బిజినెస్ చేస్తున్న ఇలాంటి సమస్యలు నెట్వర్క్ కంపెనీ కి, డిస్ట్రిబ్ర్యూటర్ మధ్య ఆర్థిక లావాదేవీల సమస్యలు ఉంటే వాటిని కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలి.

జీ నెట్వర్క్ వారు కూడా తమ ఇన్సెంటివ్ ఇవ్వలేదని కోర్టు వెళ్ళడం జరిగింది.దీనిపై కొందరు టీడీపీ నేతలు సోషల్ మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసి తనను రాజకీయంగా ఎదుర్కోలేక, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రజల్లో చెడ్డపేరు వచ్చే విధంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీనిపై వారు ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయస్థానానికి వెళ్తామని గురురాజ్ దేశాయ్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu