Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nandikotkur: నందికొట్కూరులో 58 రోజులుగా రగులుతున్న లంకా దహనం

Nandikotkur: నందికొట్కూరులో 58 రోజులుగా రగులుతున్న లంకా దహనం

hmtv 2 days ago

Nandikotkur: నందికొట్కూరులో 58 రోజులుగా రగులుతున్న లంకా దహనం

నంద్యాల జిల్లా: నందికొట్కూరులో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వాసితుల దీక్ష 58వ రోజుకు చేరింది.

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారు చేస్తున్న పోరాటానికి రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకటసుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం తమ ఊరు, ఇల్లు, పొలం, సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన నిర్వాసిత కుటుంబాలకు నా సంపూర్ణ మద్దతు. 58 రోజులుగా వీరు ఇక్కడ దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేసిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరం. శ్రీశైలం నిర్వాసిత కుటుంబాలకు తక్షణమే లష్కర్ ఉద్యోగాలు కల్పించాలి. వీరికి ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదు. ఇది వీరికి న్యాయంగా దక్కాల్సిన హక్కు.

ఇంత కాలంగా దీక్షలు చేస్తున్నా స్థానిక ఎంపీ బైరెడ్డి శబరి గానీ, ఎమ్మెల్యే గిత్త జయసూర్య గానీ వీరిని పరామర్శించడానికి కూడా రాలేదు. దీన్ని బట్టి నిర్వాసితుల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజల కష్టాలు పట్టించుకోకపోవడం సరికాదు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లను ముట్టడిస్తాం. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ కార్యక్రమంలో జయన్న, రాజారావు, నాగేంద్ర, సాలమ్మ, రాణి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu