Nandyal: అవుకు మండలంలో అంగన్వాడీ కేంద్రం వద్ద బాలికకు పాముకాటు!
నంద్యాల: అవుకు మండలం, కొండమనాయునిపల్లె అంగన్వాడి కేంద్రం వద్దకు వెళ్లిన బాలిక జాహ్నవి బాయ్ 6 పాముకాటుకు గురైంది.
కొండమ నాయునిపల్లె గ్రామానికి చెందిన రామకృష్ణ నాయక్ లక్ష్మీబాయ్ దంపతుల కుమార్తె జాహ్నవి బాయ్ అంగన్వాడి కేంద్రానికి బుధవారం వెళ్ళింది.
అక్కడ ఆడుకుంటూ ఉండగా పాముకాటుకు గురైంది గుర్తించిన అంగన్వాడి ఆయా బాలికను అవుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అంగన్వాడీ కేంద్రం వద్ద పాముల సంచారం ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

