Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nandyal: దళితులపై దాడులు చేసింది వైసీపీ నేతలే.. ఎమ్మెల్యే గౌరు చరితా

Nandyal: దళితులపై దాడులు చేసింది వైసీపీ నేతలే.. ఎమ్మెల్యే గౌరు చరితా

hmtv 6 days ago

Nandyal: గౌరు చరితా రెడ్డి.. పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే,నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఎస్సీ ఎస్టీ లపైన అనేక దాడులకు పాల్పడ్డారు.

డాక్టర్ సుధాకర్ మాస్క్ లు అడిగిన పాపానికి ..పిచ్చోడి ను చేసి..ఆయన చావుకి కరణం అయ్యారు.

YCP మాజీ MLC అనంత బాబు.. డ్రైవర్ బాడీ నీ డోర్ డెలివరీ ఘటనను దళితులు మరచిపోరు. ఎన్నికల్లో ఓట్ల కోసం..రాజకీయ లబ్ధికోసం YCP నేతలు దళితుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పెంపు పై YCP నేతలు ప్రజల్లో నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. CM చంద్రబాబు గారు రాష్ట్రంలో ఇంధన పొదుపు ఉద్యమానికి పిలుపునిచ్చారు.

కూటమి సర్కారు చేస్తున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారు అని తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, కల్లూరు మండల నాయకులు వాకటి మాధేష్, నంద్యాల జిల్లా DVMC మెంబర్ దానం తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu