Nandyal: డోన్ హైవేపై పోలీసుల వాహనం ధ్వంసం.అక్రమ రవాణాదారుల దౌర్జన్యం!
నంద్యాల: డోన్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పందుల అక్రమ రవాణా ముఠా ఎదురుదాడికి దిగింది.
పందుల లోడుతో వెళుతున్న బొలెరో వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులో ఉన్న వ్యక్తులు పోలీసుల పెట్రోల్ వాహనంపై సీసాలతో దాడి చేశారు.
ఈ దాడిలో పెట్రోల్ వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హెచ్చరిక ఫైరింగ్ చేసినట్లు సమాచారం. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

