Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nandyal: : కంపమల్లలో ఊరకుంట ఆక్రమణ.. వైసీపీ నేతలపై కేసులు పెట్టాలన్న టీడీపీ!

Nandyal: : కంపమల్లలో ఊరకుంట ఆక్రమణ.. వైసీపీ నేతలపై కేసులు పెట్టాలన్న టీడీపీ!

hmtv 3 days ago

Nandyal: : కంపమల్లలో ఊరకుంట ఆక్రమణ.. వైసీపీ నేతలపై కేసులు పెట్టాలన్న టీడీపీ!

నంద్యాల: కోవెలకుంట్ల మండలం కంపమల్ల ఊరకుంట చెరువును దాదాపు 4.22 సెంట్లు స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించుకోవడం జరిగిందని, వైసిపి నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామ టిడిపి సీనియర్ నాయకులు సూర చిన్న సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ రవికుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు పేర్కొన్నారు.

కంపమల్ల గ్రామంలో పెద్ద ఊరకుంట స్థలం ఆక్రమించుకొని బీసీ సామాజిక వర్గంపై నేపం వేస్తున్నారని.బీసీల సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని వారు చెప్పారు. దాదాపు నాలుగు ఎకరాల మేరకు స్థలాన్ని ఆక్రమించి వైసిపి నాయకులు ఇండ్ల నిర్మాణం దర్జాగా కలాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. కుంటలు చెరువులు అభివృద్ధి చేయడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నారు.

308,307 సర్వే నెంబర్లు స్థలం మొత్తం కూడా కుంటకు సంబంధించినదేనని వాటిలో వైసిపి నాయకులు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు కుంట స్థలాన్ని గుర్తించి కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలంలో నిఘా నేత్రాలు ఏర్పాటుచేసి పైశాచిక ఆనందం పొందుతున్న వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పిన వక్రబుద్ధి మారడం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో సూర చిన్న సుబ్బారెడ్డి, కోదండరామిరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి గాజుల మల్లికార్జున కే కృష్ణమోహన్ బ్రహ్మయ్య ఆచారి నాగేశ్వర్ రెడ్డి సూర సురేష్ రెడ్డి రామిరెడ్డి గారి సుమంత్ రెడ్డి వెంకట రామ సుబ్బారెడ్డి, కాల శివ, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu