Dailyhunt
Nandyala: వేసవి దాహార్తి తీర్చేలా మంత్రి కీలక నిర్ణయం..!

Nandyala: వేసవి దాహార్తి తీర్చేలా మంత్రి కీలక నిర్ణయం..!

hmtv 1 week ago

Nandyala: వేసవి దాహార్తి తీర్చేలా మంత్రి కీలక నిర్ణయం..!

నంద్యాల జిల్లా: కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లె, పెట్నికోట గ్రామాలకు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు.

కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లె గ్రామంలో పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల రూ. 9 లక్షల తో ఏర్పాటుచేసిన నూతన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

వాటర్ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం స్వయంగా మంచినీటిని తాగి నాణ్యతను పరిశీలించిన మంత్రి గొర్విమానుపల్లెలో అల్ట్రాటెక్ సిమెంట్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల రూ. 25 లక్షలతో ఏర్పాటుచేసిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కొలిమిగుండ్ల మండలం, బందార్లపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన మంత్రి. కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టిన ఆర్ఓ ప్లాంట్ పునరుద్ధరణ పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వేసవిలో నీటి ఎద్దడికి ఆస్కారం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలనే సంకల్పంతో మినరల్ వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశామన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu