Narasaraopet: నరసరావుపేట ప్రయాణికుల బస్సుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు!
నరసరావుపేట: నరసరావుపేటకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులు ఈ నెల 20వ తేదీ రాత్రి టూర్ కోసం బయలుదేరారు.హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లి, అక్కడి నుంచి నేపాల్ ట్రిప్ పూర్తి చేసుకుని ఈ రోజు ఉదయం అయోధ్యకు బయలుదేరారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా, నైమిశారణ్యం దాటిన వెంటనే ప్రయాణికుల బస్సు ప్రమాదానికి గురైంది.
అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

