Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Narsampet: రూ.3 లక్షలతో టేకు కర్రతో అపురూప కలాన్ని రూపొందించిన రాజేశ్వర్

Narsampet: రూ.3 లక్షలతో టేకు కర్రతో అపురూప కలాన్ని రూపొందించిన రాజేశ్వర్

hmtv 1 week ago

Narsampet: రూ.3 లక్షలతో టేకు కర్రతో అపురూప కలాన్ని రూపొందించిన రాజేశ్వర్

నర్సంపేట: పట్టణంలో జగదీశ్వర్ విశ్వబ్రాహ్మణుడు కర్రపై కలం (పెన్ను) రూపకంగా చిత్రించగా వాహనంపై ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు తీసుకురాగా మండల విద్యాశాఖ అధికారి కోర్ర సారయ్య, హెచ్ఎం కాంతారావు విద్యార్థులకు కలం గొప్పతనం గురించి మాట్లాడుతూ, ప్రపంచానికి అర్థం లాంటిది అన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణ, గుర్రం జాషువా, అద్దేశ్రీ, శ్రీ శ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, అబ్దుల్ కలాం, కాలోజీ నారాయణరావు కలంతోనే గొప్ప రచనలు చేశారని విద్యార్థులకు వివరించారు.

గిన్నిస్ బుక్ రికార్డు కోసం కర్రతో చేసిన పెన్ను కలం నర్సంపేట పట్టణం సర్వాపురం ఇందిరమ్మ కాలనీ నివాసితులు విశ్వబ్రాహ్మ ణులు కొదురుపాక రాజేశ్వర్ హస్తకళకారుడు 24 ఫీట్లు పొడవు మూడు ఫీట్లు అడ్డము టేకు కర్రతో మూడు లక్షల ఖర్చుతో కలాన్ని గత మూడు నెలలుగా అపురూపమైన అందంగా చిత్రీకించారు. ఈ కలం గిన్నిస్ బుక్ రికార్డులో నమో దు చేసుకోవడానికి ఈ భారీ కలాన్ని రూపొందించినట్లు కుదురుపాక రాజేశ్వర్ తెలిపారు. వాహనంపై ఊరేగించడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu