Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: ఆడబిడ్డలకు శ్రీరామరక్ష.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు!

Nellore: ఆడబిడ్డలకు శ్రీరామరక్ష.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు!

hmtv 2 weeks ago

Nellore: ఆడబిడ్డలకు శ్రీరామరక్ష.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు!

నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో ఎస్సై రాజేష్ 'శక్తి యాప్'పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ శ్రీనివాసరెడ్డి, ఐసిడిఎస్ సీడీపిఓ సునీలత, ఏపీఏం రవిశంకర్ రెడ్డి హాజరై విద్యార్థినులకు యాప్ ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు.

మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్‌ను ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు.మహిళలు అప్రమత్తంగా ఉండి, అత్యవసర సమయంలో శక్తి యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ ప్రసాద్ రావు,ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ,ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu