Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: ఆధారాలతో సహా మీడియా ముందు ప్రదర్శించిన కాకాణి

Nellore: ఆధారాలతో సహా మీడియా ముందు ప్రదర్శించిన కాకాణి

hmtv 1 week ago

Nellore: ఆధారాలతో సహా మీడియా ముందు ప్రదర్శించిన కాకాణి

నెల్లూరు: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతుల్ని నిలువునా దోచుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

కాలువలు కూడా కనబడకుండా పూడిపోయిన పరిస్థితి చూస్తే ఇరిగేషన్ శాఖలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం అవుతుందన్నారు మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ

పిడతాపోలూరు దగ్గర కాలువ కూడా కనబడకుండా అడవిలా దారుణంగా ఉందని, కనుపూరు కాలువ పనులు చూస్తే కనీసం నీళ్ళు పోయే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇరిగేషన్ లో చేసిన దోపిడీకి సాక్ష్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి లోనే కాకుండా నగర నియోజకవర్గంలో కూడా దొంగ బిల్లులు చేసి దోచుకుంటుంటే మంత్రి నారాయణ ఏం చేస్తున్నాడో అర్ధం కావట్లేదని, ఇది నారాయణ చేతగానితనమా.

సోమిరెడ్డి చేతివాటమో అర్థం కావట్లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. యాభై కోట్ల రూపాయలు సర్వేపల్లి కాలువ పనులకు నిధులు కేటాయించామని చెప్పారని, అవి ఏ పనులకు ఉపయోగిస్తున్నారు రైతులకు వివరించాలని కోరారు.

గతంలో ఇరిగేషన్ వాళ్ళు మాత్రమే వాటాలు పంచుకుంటే. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు కూడా కలిశారని చెప్పారు. రైతుల్ని అడ్డుపెట్టుకుని కోట్లు దోచుకుంటున్నారని, కరెంట్ కనెక్షన్ అడిగితే. పోలీసులు రైతుల్ని పిలిపించి కొట్టిన ప్రభుత్వం దేశంలో ఇదొక్కటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక రైతుల్ని హింసించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని, మీ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

ఇప్పటికే పాతిక కేసులతో సిల్వర్ జూబ్లీ అయిందంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. విజిలెన్స్ విచారణ ఎలా వుంటుందో 2029 లో చూస్తారుమని అన్నారు. జిల్లా కలెక్టర్ మౌనం.. జిల్లా రైతులకు తీరని ద్రోహం చేసిన వారవుతారని, ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి, దొంగ బిల్లుల్ని ఆపాలని కోరారు మంత్రి కాకాణి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu