Dailyhunt
Nellore: చనిపోయిన వ్యక్తిపై నెట్టేసే ప్రయత్నం.. ఖంగుతిన్న పోలీసులు!

Nellore: చనిపోయిన వ్యక్తిపై నెట్టేసే ప్రయత్నం.. ఖంగుతిన్న పోలీసులు!

hmtv 1 week ago

Nellore: చనిపోయిన వ్యక్తిపై నెట్టేసే ప్రయత్నం.. ఖంగుతిన్న పోలీసులు!

Nellore: గత ఏడాది నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసు.

హైదరాబాదులో జరిగిన సంఘటనతో. కేసు ఇప్పుడు హైదరాబాద్ లో విచారణ కొనసాగుతుంది. మాజీ సీనియర్ జర్నలిస్ట్ & ప్రస్తుత దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డె శ్రీకాంత్ నాయుడు పై గత ఏడాది డిసెంబర్ పదో తేదీ రాత్రి జరిగిన హత్యాయత్నం కేసులో కీలక ముద్దాయిలైన 1) మాలెపాటి రవీంద్ర నాయుడు 2) కంచర్ల సునీల్ కుమార్ 3) కంచర్ల రమేష్ లు విచారణ నిమిత్తం సైబరాబాద్ పోలీసుల ముందు మంగళవారం విచారణకు హాజరయ్యారు.

అల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ విచారణలో విచారణ అధికారుల బృందం ముద్దాయిలను కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై విచారణ మొదలుపెట్టింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణలో శ్రీకాంత్ నాయుడు పై జరిగిన హత్యాయత్నానికి చనిపోయిన మాలేపాటి సుబ్బానాయుడు కారణం కావచ్చు అని,

తమకేమీ సంబంధం లేదని ముద్దాయిలు తెలిపినట్లు సమాచారం. శ్రీకాంత్ నాయుడు హత్యాయత్నానికి 53 రోజుల ముందు సుబ్బానాయుడు మృతి చెందాడు కదా? ఆ తరువాత ఈ సఫారీ హత్య కుట్ర కొనసాగించింది ఎవరు అనే అంశాలపై పోలీస్ విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu