Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: దగదర్తిలో తెల్లవారుజామునే కార్డన్ అండ్ సెర్చ్

Nellore: దగదర్తిలో తెల్లవారుజామునే కార్డన్ అండ్ సెర్చ్

hmtv 2 days ago

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల జిల్లా పోలీస్ అధికారులకు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లపై జారీ చేసిన ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించే దిశగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

డిజిటల్ మ్యాపింగ్ ద్వారా క్రైమ్ స్పాట్స్ గుర్తింపు, రౌడీషీటర్లు, అనుమానితులు, పరారీ నిందితులు, NBWs/సమన్లు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలు, అనుమానాస్పద వాహనాలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఈ ఆదేశాల మేరకు, ఈ రోజు అనగా తేది 22.05.2026న ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని లైన్స్ నగర్ కాలనీలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.

ఈ కార్డన్ & సెర్చ్ కార్యక్రమం కావలి రూరల్ సర్కిల్ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, దగదర్తి ఎస్సై జపాన్ కుమార్, బిట్రగుంట ఎస్సై రామకృష్ణ, అల్లూరు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి మరియు మూడు పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా లైన్స్ నగర్ కాలనీలోని ఇళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. లైన్స్ నగర్ సమీపంలోని కంపెనీలలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అద్దె గృహాలలో నివసిస్తున్న వారి నివాసాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేశారు.

తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుని పరిశీలనలో ఉంచారు. వాహన యజమానులు సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించగా, పత్రాలు లేని వాహనాలపై మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలకు నేరాల నివారణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండటం, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అక్రమ కార్యకలాపాలు లేదా మత్తు పదార్థాల వినియోగం/సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu