Nellore: ఏఎస్ పేటలో సాగునీటి ఆనకట్ట కనుమరుగు: 50 ఎకరాల విస్తీర్ణం ఆక్రమణలతో 5 ఎకరాలకు కుదింపు!
ఏఎస్ పేట: ఏఎస్ పేట మండల కేంద్రంలోని ఆనకట్ట ప్రాంతం ఆక్రమణలతో రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.
గతంలో ఈ ఆనకట్ట సుమారు 50 ఎకరాలలో వరకు ఉండే విస్తీర్ణం ప్రస్తుతం ఐదు ఎకరాలకు ఆక్రమాదారులు ఆక్రమించుకుంటూ నేడు 5 ఎకరాలకు చేరుకుంది. దీంతో గతంలో ఆనకట్ట కింద సాగు చేసుకుంటున్న 200 ఎకరాల రైతులు నేడు పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏఎస్ పేట మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ కాజా నాయబ్ రసూల్ దర్గా ప్రముఖ యాత్రిక స్థలం కావడంతో ఇక్కడ అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుండి దుర్గా దర్శనానికి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ సందర్భంలో గ్రామంలో ఉండే పలువురు స్థానికులు ఆనకట్టను ఆక్రమించుకొని ఇళ్లను ఏర్పాటు చేసుకుంటుండడంతో ఇక్కడ స్థలాలకు గిరాకీ ఉంది. ఆనకట్ట ఆక్రమణకు గురికావడంతో నీటి ప్రవాహం తగ్గి ఈ ప్రాంతంలో ఉండే 2 వందల ఎకరాల సాగుభూమి కూడా ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక రైతులు ఆనకట్ట ఆక్రమణలను తొలగించి తమ పొలాలకు నీటిని అందించాలని సంబంధిత అధికారులకు డిమాండ్ చేస్తున్నారు.

